సాధన – సిద్ది
ఎదో ఒక స్థితిలో మనస్సు చలించకుండా ఉండటం సాధన. అపుడు నీవు జాగరూకతతో
ఉంటావు. ఈ స్థితి ముదిరి, గాఢమై, నీలో పాతుకున్న మీదట నీ ప్రయత్నం ఉండదు. నీకు
బాధ్యత లేదు. అపుడు ఆ స్థితిని ‘సిద్ది ‘ అంటారు. సిద్ధులు స్థబ్డులై ఉండనక్కరలేదు. ప్రపంచ వ్యవహారమును
నిరంతరము జరుపుచుండు ఈశ్వరుడే అట్టి అచేతన స్థితిలో స్థబ్దుడై లేడు.
నిద్రపోతున్నపుడు వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు గాని
అంతర్గతంగా ఉండే తమ పూర్వ వాసనల వల్ల , వాళ్ళు అదే వ్యక్తిత్వాన్ని పొందుతారు. ఆ
విధంగానే, అంతరవాసనలనే జీవమూలనాశనం చేయకుంటే, మరణ సమయంలో అవి హృదయంలోకి చేరుకుoటాయే గాని నశిo చ వు.
జీవులిట్లా పునర్జన్మ పొందుతారు.
మనిషి పాప పుణ్య కర్మల వల్ల భూమిపై జన్మ ఎత్తవలసియే ఉన్నది. భగవంతుడు
తన కృప వల్ల, పునర్జన్మ కు సంబంధించిన ఈ జ్ఞానాన్ని, మనుషులకు అందనీయడు.
పునర్జన్మలో గుణవంతులై ఉంటే గర్వం, అలా కాకుంటే దిగులు చెందుతారు. రెండూ చెడే .
ఆత్మను తెలుసుకొని, ఆత్మ జ్ఞానాన్ని పొందితే చాలు.
ఆకలితో బాధపడే వాణ్ని అది స్వప్నం అని చెప్పటం ఎంత వరకు సమంజసం.
జ్ఞాన దృష్టి తొ చూస్తే ఎందులో ఆ బాధ చిన్న భాగంగా ఉంటుందో, ఆ లోకంలో
వలెనే, ఆ బాధ కూడా నిష్కర్షగా ఒక స్వప్నమే. కాకపోతే, కలలో కలిగే ఆకలిని, కలలోని
ఆహారంతోనే తృప్తి పరచాలి. మెలకువలో కలిగే ఆకలిని, మెలకువలోని ఆహారంతోనే తృప్తి
పరచాలి. ఈ కల మెలకువ అనే వ్యవస్థలను కలపటానికి వీలు లేదు.
నీవు ఆత్మానుభూతిని పొంది ఉండి, ఈ మాయామయ దృశ్యమాన జగత్తు నుంచి
మేల్కొనే వరకూ, నీ దృష్టికి వచ్చినపుడల్లా, బాధా నివారణ కల్గించటం ద్వారా నీవు సమాజ సేవ తప్పక చేయ వలసిందే. నేను కదా
చేస్తున్నాను అనే భావం లేకుండా, నేను భగవంతుని చేతిలో పరికరాన్ని అని భావించాలి.
నా కంటే తక్కువ లేదా హీన స్థితిలో ఉన్న వాడికి సహాయం చేస్తున్నాననే భావన రాకూడదు.
వానిలోని భగవంతునికి అర్పించేందుకు ఒక మార్గంగా వాడికి నీవు సాయపడాలి.అటువంటి సేవ
అంతా ఆత్మను సేవించటమే. ఇతరులకేవ్వరికీ సహాయం చేయటం లేదు. నీకు నీవే చేసుకుంటున్నావు.
వాస్తవానికి సహాయం చెయ్యటానికి ‘ఇతరులు’ అంటూ ఎవరూ లేరు. స్వర్ణకారుడు ఆభారణాలలోని
బంగారాన్ని చూస్తున్నట్లుగానే, ఆత్మజ్ఞుడు ఆత్మను మాత్రమే చూస్తుంటాడు.
నిరాశ – జ్ఞానము
నిరాశయే జ్ఞానము. నిరాశ వేరు, జ్ఞానము వేరు కాదు. నిజమున రెండూ
ఒక్కటే. నిరాశ అనగా ఒక్క విషయము వైపునకు మనసు పోకుoడు ట . జ్ఞానమనగా ఒక్క విషయము
తోచకుoడుట.
నిద్ర – చావు
రెండు జాగ్రదావస్థల మధ్య ఉండేది నిద్ర. రెండు పుట్టుకల మధ్య ఉండేది
చావు. రెండూ అశాశ్వతమైనవే. జీవాత్మ అశరీర స్థితి లోనికి రాదు. దాని శరీరాలు
మారుతుంటాయి. స్థూల శరీరమే కాకపోవచ్చు. సుషుప్తిలోను, స్వప్నం లోను, లేక పగటి
కలలలోను సంభవించే విధంగా అది సూక్ష్మశరీరమైనా కావచ్చు.
అసలైన నేను, నేను నేనైన నేను (I AM THAT I AM) మూర్తి త్రయం (ఫాదర్, సన్,
హోలిఘోస్ట్) అను క్రైస్తవ సిద్ధాంతం.
తండ్రి అయిన భగవంతుడు ఈశ్వరునకు,
కుమారుడైన భగవంతుడు గురువుకు,
పరిశుద్దాత్మ అయిన భగవంతుడు ఆత్మకు – సమానం అనే ప్రకటనలో వేదాంత సారం ఉంది.
“ఈశ్వరో గురురార్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ
దక్షిణా మూర్తయే నమః” అంటే భగవంతుడు తన భక్తునికి గురువు రూపంలో కన్పించి ,
పరిశుద్ధాత్మ అంతర్యామియై ఉన్నదనీ
బోధిస్తాడు. అంటే భగవంతుడు చైతన్యమనీ, ఈ చైతన్యం సర్వే సర్వత్రా అంతర్భూతమై
ఉన్నదనీ, ఆత్మను తెలుసుకోవలసి ఉన్నదనీ, ఈ ఆత్మజ్ఞాన సిద్దియే భగవత్సాక్షాత్కారమనీ
అర్ధం .
సర్వోన్నత శక్తి అయిన ఆత్మ ఒకటి ఉన్నదనీ, దానికి దారి చూపేందుకు
మాత్రమే గ్రంధాలు ఉపకరిస్తాయనీ మనం తెలుసుకోవాలి.
మూలమైనది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అదే భగవంతుడు. ఆత్మను తెలుసుకోవడం
భగవంతుని తెలుసుకోవడమే. నిజానికి భగవంతుడు, ఆత్మ కంటే వేరు కాదు.
ఈశ్వరుడు వేరు, నేను వేరు అను భావన కoటే , ఈశ్వరుడే నేను అను అభిన్న
భావన పావనమైనది.
దేహము జడము. అది నేను కాదు. ‘నేనేవ్వడు’ అని వెదికి చూసిన అట్టి వారి హృదయాంతరంగ
మందు పరిపూర్ణు డైన ‘అరుణాచల శివుడు’ ‘అహం’ స్ఫురణ రూపుడై స్వయముగా ప్రకాశిస్తూ
ఉంటాడు.