Tuesday, 9 August 2016

మనవి

                                              మనవి

‘శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి యొక్క సందేశాన్ని అందరికీ అందించాలి’ అన్న ఆలోచన నాలో రావటమే భగవాన్ యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను.
నా ఈ చిన్న ప్రచురణ మీ హృదయాలను తాకి, మీ హృదయమనే ఆత్మను మీరు తెలుసుకోగలిగితే, ఈ నా ప్రయత్నం సఫలమైనట్లే. ఇది చదవటం ఎంత తేలికో ఆచరణ అంత కష్టం. అంటే ఆచరణ సాధ్యం కాదని, అందుకోలేనిది కాదని మాత్రం కాదు. దీనిపై పూర్తి ఏకాగ్రత, తెలుసుకోవాలనే తృష్ణ ఉండాలి. నిన్ను నీవు తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. మనం ఆత్మ గౌరవం, ఆత్మ తృప్తి, ఆత్మ విమర్శ ,ఆత్మ హత్య, ఆత్మ క్షోభ, ఆత్మాభిమానం మొదలైనవి మనకు తెలియకుండానే ప్రముఖం చేసి మాట్లాడతాము. అంటే మన దేహాన్ని ఎక్కడా ప్రముఖం చేసి మాట్లాడం. కనుక, అన్నింటికీ మూలమైన ,ఈ ఆది, అంతం లేని ఎప్పుడు నిజమైన నీవుగా ఉండే ఆత్మని తెలుసుకో. మిగిలినదంతా నీకే అవగతమౌతుంది.
ఆశ్రమంలోని వివిధ పుస్తకాలనుండి ఈ విషయాలను సేకరించి, క్రోడీకరించి, అందిస్తున్నాను. ఈ ప్రచురణకు అనుమతి ప్రసాదించిన ఆశ్రమం వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు.

                                                                                  ఒక ఆత్మన్వేషి

                                                                        (అక్బర్ అలీ - 9949096366)

No comments:

Post a Comment