సాలీడు
తననుండి నూలు వెలికితీసి, మరల దానిని తనలోకే తీసుకోనును. అట్లే మనస్సు కూడా తననుండే
జగత్తును కల్పించి, తనయందే లయము చేసుకుంటుంది.
మనిషి
కలగంటాడు. ‘తనని చితకతన్నారని తాను బాధలలో
ఉన్నానని’. నిద్రలో అదంతా నిజంగానే ఉంటుంది. మేలుకొని అదంతా
కల అని నవ్వుకుంటాడు. అలాగే జ్ఞానము ఉదయించినపుడు ఇదంతా ఒక కల అని తెలుసుకుంటావు.
స్వప్నావస్థ నుండి జాగ్రదావస్థకు వస్తే గాని అది కల అని నిజము కాదని తెలుసుకోలేవు. అలాగే
జాగ్రదావస్థ ఉన్నంత వరకు ఈ జగత్తు, జీవం, ఈశ్వరం అన్నీ నిజమనుకుo టా వు. ఈ అవస్థలు
దాటి, తురియావస్థ కు వస్తే గాని ఇవన్నీ నిజము కావని ఒక ఆత్మ మాత్రమే సత్యమని
తెలుసుకోలేవు.
మనుషులు
‘నేను – నేను’ అని చెప్పునట్టిది జనన మరణ ములున్న దేహము గురించియేగాని, అవిలేని
ఆత్మ గురించి కాదు.
మనస్సునకు,
ప్రాణమునకు పుట్టుచోటు ఒక్కటే. మనస్సు యొక్క తొలి
తలంపు ‘నేను’ అను అహంభావం. ఈ అహంభావం నుండే శ్వాస బయలు దేరుతున్నది. కనుక
మనస్సణగినప్పుడు ప్రాణము, ప్రాణము అణగినప్పుడు మనస్సు అణుగును. కాని సుషుప్తి
యందు, మనస్సు అణగినను ప్రాణము అణుగుట లేదు. దేహరక్షణ నిమిత్తం, అంటే దేహం మరణిoచిoదేమో
అని ఇతరులు భావిoచకుండా ఉండుటకు ఈ విధముగా
ఈశ్వర నియతిచే ఏర్పడి యున్నది.
జాగృతి
యందు, సమాధి యందు, మనస్సణగినపుడు ప్రాణము అణుగుచున్నది.అంటే ప్రాణము యొక్క స్థూల
రూపము అనవచ్చును. మరణకాలము వరకు, శరీరమున
ప్రాణమును ఉంచి, మరణ సమయమున, మనస్సు ప్రాణమును ఆక్రమించుకుని తీసుకొని
పోవుచున్నది.
ఈశ్వరుని
ఆజ్ఞానుసారము, కర్మ ఫలము లభించును. కర్మము జడము కనుక శుభ అశుభ ఫలప్రదములతో దానికి స్వతంత్రశక్తి అసంభవమని,
అది జడముగా నుండుట వలననే ఎన్నటికి పరము కాజాలదని, ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభఫలముల
నిచ్చుచూ, జగత్ నియామకుడై ఉన్నాడని, అతడే పరుడని గ్రహింపవలెను.
కర్మ
ఫలము అశాస్వతమగుట వలన, తిరిగి కర్మసముద్రమున పడుతూ, మోక్షమును నిరోధించుచున్నది. సుకర్మ
ఫలముల వల్ల స్వర్గాది భోగరూపమున, దుష్కర్మ ఫలముల వల్ల నరకవాస కష్టాలను అనుభవరూపమున
పొందుతారు. ఈ ఫలానుభవ అనంతరం ఆ అనుభవ వాసన రాబోవు జన్మమునకు కారణముగా ఏర్పడి, జనన
మరణములను అలలుగా కర్మ సముద్రమున బడుచున్నది.
అంతా
పరమాత్మ స్వరూపమే అంటూ చేసే జగత్తు యొక్క సేవయే ‘పంచ భూతములు, సూర్యచంద్రులు,
జీవుడు’ అను అష్ట మూర్తులు గల పరమశివుని పూజ అవుతుంది. విగ్రహారాధనము ఈశ్వరుని
అష్టమూర్తులలో నొకటియగు పార్థివమూర్తి యొక్క ఏక దేశారాధనమే గాని, పూర్ణ పూజ
కానేరాదనియు, సర్వ జగత్తును ఈశ్వర స్వరూపముగా గ్రహించి చేయు సేవయే ఉత్తమోత్తమమగు
పూర్ణ పూజ అనియూ గ్రహించవలెను.
ఈశ్వరుడు
వేరు, నేను వేరు అను భావముతో కూడిన ఈశ్వర భావన కంటే, అతడే నేననెడు అభిన్న భావన పావనమైనది. హృదయ స్థలమునందు మనస్సు స్వస్థమై యుండుటయే కర్మము. అదియే భక్తి,
అదియే యోగము. అదియే జ్ఞానము. ఇది
నిశ్చయము. అనగా మనస్సు వి / జ్రుం భించుచోటు శిరస్సే అయిననూ, అది పుట్టుచోటు
హృదయమే అగును.
అనగా,
ఆత్మ తేజము నుండి ఒక రశ్మి బయలు వెడలి శీర్ష స్థానమును చేరి మనస్సు అగుచున్నది.
అది స్వస్థత చెందుట అనగా తన ఉత్పతి స్థానమును తిరిగి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ.
అదియే హృదయము. మనస్సు యొక్క స్వరూపమును వెదకిన యెడల మనస్సు అన్నదియే లేదని
తెలియును. అది ఆత్మ నుండి వచ్చిన ఒక రశ్మి.
No comments:
Post a Comment