Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 01



ఓం నమో భగవతే శ్రీ రమణాయ

మహర్షి యొక్క ప్రథమ ఉపదేశము:
కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగా నుండుటయే ఉత్తమము.

- డిసెంబర్ 1898 లో భగవాన్ మౌన ముద్రలో ఉండగా తన తల్లికి కాగితముపై వ్రాసి ఇచ్హినది.

మహర్షి యొక్క ప్రథమ వాణి :
‘నేను’ అను భావము యెందుండి పొడము చున్నదో పరికించిన, మనస్సు అందులో లీనమగును. అదియే తపస్సు. మంత్ర జపమప్పుడు, మంత్ర నాదమెందు ఉద్భవించునో పరికించిన మనస్సు అందులో లీనమవును. అదియే తపస్సు.

- గణపతి ముని తపస్స్వభావము చెప్పమని ప్రార్ధించగా, 11 సంవత్సరముల మౌనము తర్వాత    18-11-1907 న పలికినది.

No comments:

Post a Comment