Tuesday, 9 August 2016

నిత్యసత్యం - 08


హృదయం
చైతన్యం యొక్క స్థానం హృదయమే కాని శిరస్సు కాదు, హృదయం వక్షస్థలానికి ఎడమవైపున ఉన్నట్టి భౌతిక అవయవం కాదు. అది కుడివైపున ఉన్న చైతన్యం. ఈ హృదయాన్నే ఆత్మగా భావించమని, అది శరీరంలోను, దేహాతీతమని తెలుసుకోవాలి. అసలైన చైతన్యాన్ని నీవు అన్వేషిస్తున్నావు. అది నీకు ఎక్కడ లభిస్తుంది. దాన్ని నీ వెలుపల పొందగలవా. దాన్ని నీలోనే చూడాల్సి ఉంది. కాబట్టి లోపలికి చూడమన్నాను. హృదయం చైతన్యానికి ఉనికి పట్టు లేక చైతన్యమే అది.
గది చీకటిగా ఉన్నప్పుడు, వెలుతురు కావలసి వస్తే, దీపం కావాలి. కాని సూర్యుడు ఉదయిస్తే ఇక దీపంతో అవసరం లేదు. ఎందుకు? సూర్యుడు స్వయం ప్రకాశం కల్గినది కనుక. అది వస్తువులను చూచేందుకు ఆవసరమే.  కాని హృదయాన్ని చూచేందుకు మనస్సును దానివైపుకు తిప్పితే చాలు. అప్పుడు మనస్సు తానై నశించి, హృదయం అనే ఆత్మ ప్రకాశి స్తు o ది.
‘నేను ఎవరు’ అను విచారణ మాత్రమే ఆవశ్యకం. సుషుప్తి సమయంలోను, మెలకువ సమయంలోను, కొనసాగుతున్న అస్తిత్వం ఒక్కటే . ‘నిద్ర లేచింది ఎవరు’ అని అడిగితే ‘నేను’ అంటావు . ఈ ‘నేను’ నే గట్టిగా పట్టుకో.   నిత్యసత్తా తానై ద/ర్సనమిస్తుంది . ముఖ్యాతిముఖ్య విషయం ‘నేను’ ను వెతకటమే గాని హృదయ కేంద్రం పై ఏకాగ్రం చేయటం కాదు. 
ఆత్మ
ఆత్మ అంటే అసలైన నేను, వ్యక్తిగతం కాదు. అది సర్వసమృద్ధమైన ఎరుక. అది పైకి గోచరించే వ్యక్తిగత అనుభవం కాదు. దానికీ, వ్యక్తిగత ఆహానికీ తేడా ఉంది. నిజానికి ఈ అహానికి ఉనికి లేనే లేదు. దీనిని  మనస్సు కల్పిస్తుంది.    ఆత్మను అనుభవసిద్దo చేసుకోనీయదు. ఆత్మ ఎప్పుడూ సంస్థితమే. ఎప్పుడూ అనుభవసిద్ధమే. కాని, ఎన్నో అవరోధాలను కల్పించే మానసిక వాసనలు అనగినప్పుడే, ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది. నిత్యమూ, నిరంతరంగా ఆ ఆత్మను ఎరిగి ఉండటమే, ఆత్మ సాక్షాత్కారమంటే.  ఆత్మ అనేది విశుద్ధ స్థితి.  నేనున్నాననే ఎరుక .
ఆత్మ సాక్షాత్కారం పొందటమంటే కొత్తగా దేనినో సృష్టించటం కాదు. చూడటం కాదు. అంతకు పూర్వం లేని దానినేమీ సాధించటం లేదు. ఎల్లవేళలా నీ నిజస్థితిలో సుస్థిత మవటమే. ఆ స్థితి దృశ్యానికీ, ద్రష్టకీ అతీతం. చూచేవాడుగాని, చూడబడేది గాని ఉండవు. ఇపుడు అన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు.
ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. సాక్షాత్కారమంటే కేవలం తానుగా ఉండటమే. దీనిని తెలుసుకోవటం గానీ, ఏదైనా అవటం గానీ కాదు. ఆత్మలో సంస్థితమైనవారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావిoచవలసిoదేమీ లేదు. అంటి పెట్టు కొని ఉండవలసిoదల్లా మౌనానుభవాన్నే (ఆ స్థితిలో తానుగా ఉండటం తప్ప వేరే సాధించవలసిoదేమీ ఉండదు. మౌనమంటే వాక్కుకీ, భావానికీ అతీతమైన స్థితి. అహంకారం ఏ మాత్రం ఉదయించని స్థితి. మౌనానుభూతే, అసలైన, పరిపూర్ణమైన జ్ఞానం, మౌనమైన ఆత్మే భగవంతుడు.ఆత్మే జీవుడు. ఆత్మే విశ్వం. ఆత్మే అసలైన జ్ఞానం.
ఏ భావమూ లేని స్థితే నిజమైన స్థితి. ఆత్మని గ్రహిoపని వారెవరైనా ఉంటారా అసలు. తన ఉనికిని ఎవరైనా కాదంటారా. ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక గమ్యమని అనుకుంటే అది శాశ్వతo కానేరదు. ఎందుకంటే, ఈ అహంకారం కంటే ముందే  గమ్య ముంది. గమ్యంలో ఉన్నదేదో అది మన పుట్టుట కo టే ముందే ఉంది. 
మనస్సు తనని తాను నాశనం చేసుకోలేదు. అందువల్ల దాని యొక్క నిజస్వరూపం తెలుసుకో. ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది. ఆత్మలో సంస్థితమైనప్పుడు, మనస్సు గురించి పట్టించుకోనక్కరలేదు.

అహంకారం ఉదయించిన తర్వాత, కాలమనే భావం వస్తుంది. కాని కాలానికి, దేహానికి అతీతమైన ఆత్మవు నీవు. ఈ రెండు లేకపోయినా నువ్వున్నావు. స్వభావాలు విస్తీర్ణమై , మనస్సు నిర్మలమై, ప్రతి వారిలో ప్రతి పనిలో ఈశ్వరుణ్ణి చూడగలిగే శిక్షణ  పొందాలి.

No comments:

Post a Comment